Header Banner

పదో తరగతి ఫలితాల ముహూర్తం ఫిక్స్‌.. ఏపీ-తెలంగాణకు కౌంట్‌డౌన్ స్టార్ట్! ఈ సారి ప్రత్యేకంగా..!

  Sat Apr 19, 2025 09:44        Education

పదో తరగతి ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ పదో తరగతి మూల్యాంకనం పూర్తయింది. తెలంగాణలో పదో తరగతి ఫలితాల ప్రకటన వేళ గ్రేడింగ్ విధానం పైన అధికారులు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు. ఇటు పదో తరగతి ఫలితాలను విడుదల తేదీ వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటుగా మార్కుల మెమోలను అభ్యర్ధుల వాట్సాప్ కు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల తేదీ అధికారికంగా రావటంతో ఇప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవుతున్నారు.

ఈ నెల 23న ఫలితాలు
ఏపీలో పదో తరగతి ఫలితాలు ఈ నెల 23న విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్దమైంది. ఏపీలో ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 5,64,064 మంది ఉండగా. .తెలుగు మాధ్యమంలో 51,069 మంది విద్యార్ధులు పరీక్ష రాసారు. ఫలితాలను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్‌ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు.

తెలంగాణలో ఫలితాలు
అదే విధంగా తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాఖరు కల్లా వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse. telangana.gov.in లో పొందు పేర్చనున్నారు. తెలంగాణ లోనూ ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలో ఫలితాలు విడు దల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు చెబుతు న్నారు. ఫలితాల కోసం tgbie.cgg.gov.in లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోనూ పదో తరగతి మార్కుల జాబితాలను సిద్దం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి స్పష్టత
వచ్చే వారం ఈ ఫలితాల విడుదలకు అధికారులు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సారి ఫలితాల వేళ ప్రభుత్వం నుంచి కీలక అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది. పదో తరగతి లో గ్రేడింగ్ విధానం తొలిగించి.. మార్కులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక.. మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దాని పైన స్పష్టత ఇవ్వలేదు. దీని పైన స్పష్టత ఇస్తేనే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ పూర్తయినా.. ఈ అంశం పైన క్లారిటీ వస్తే మార్కుల జాబితాలను సిద్దం చేసి.. ఫలితాలను ఈ నెల 23 లేదా 24 తేదీల్లో విడుదలకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SSCResults2025 #APResults #TelanganaResults #10thClassResults #BoardResults #StudentsUpdate